*రెవెన్యూ' ఇష్టారాజ్యం.. 'ధ్రువీకరణ' కష్టం..*
*ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ ప్రతాల జారీలో సిబ్బంది ఇష్టారాజ్యం*
**కరువైనఅధికారులపర్యవేక్షణ*
*సిబ్బంది లేరనే పేరుతో అనర్హులకు బాధ్యతలు.*
*ప్రజలకు తప్పని కష్టాలురెవెన్యూ లీలలు*
*నిర్మల్ గూఢచారి న్యూస్*
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాలంటే.. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలను ఏడు రోజుల్లో, కుల ధ్రువీకరణ పత్రాలను నెల రోజుల్లో రెవెన్యూ సిబ్బంది వాటిని అందజేయాల్సి ఉంటుంది. దీని కోసం దరఖాస్తు దారుడు సమర్పించిన పత్రాలు సరైనవో లేదో నిర్ధారించుకోవడంతోపాటు సంబంధిత ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిర్మల్ జిల్లాలో ని దిలావర్పూర్,కూభీర్ ,లోకేశ్వరం,బాసర్,పేంబి,దస్తురాబాద్,తనుర్ ,నర్సపూర్,సోన్,కూంటాల,తహసీల్ కార్యాలయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. దీంతో వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతుండగా, అవినీతి సైతం చోటుచేసుకుంటుందనే ఆరోపణలున్నాయి. కోందరు అక్రమలకు అశపడి అగ్రవర్ణకులకు కూడా యస్ సి.యస్.టి ల సర్టిపికేట్లు కూడ గతంలో కూంటాల తహశీల్ దారు కార్యలయం కూడ జరి చేయడము జరిగింది.మహరాష్ట్రం నుండి వలస వచ్చిన లంబాడ ,బిసి,, లంబాడలకు యస్ టి కుల పత్రలు ఇస్తున్నారు.
ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం..
నిబంధనల ప్రకారం కుల, ఆదాయ ధ్రువీకరణ పొందేటప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులు పరిశీలించాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీకి 30 రోజులు, ఆదాయ , నివాస ధ్రువపత్రాలకు వారం రోజులు గడువు ఉంది. వీఆర్‌ఓ, ఆర్‌ఐ నిర్థారణ తర్వాత తహీసీల్దార్ సంతకంతో ఇవి జారీ అవుతాయి. అలాగే కంప్యూటర్‌లో ఎవరు ముందు ఆదాయ ధ్రువపత్రానికి దరఖాస్తు చేసుకుంటే వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటోంది. మిగిలిన వారివి వరుస క్రమంలో జారీ చేయాలి. కుల దృవీకరణ పత్రం జారీకు మీసేవలో చేసుకున్న దరఖా స్తు ప్రతులు సక్రమంగా ఉన్నదీ లేనిది వీఆర్‌ఓ తప్పనిసరిగా పరిశీలించాలి. పక్కాగా క్షేత్రస్థాయిలో కుల గుర్తింపు పై ఆరా తీయాలి. నివేదికను ఆర్ ఐకి ఫార్వర్డ్ చేయాలి. వీఆర్‌ఓ పంపించిన దాన్ని ఆర్‌ఐ చెక్ చేయాలి. అన్ని సక్రమంగా ఉంటే నివేదికను తయారు చేసి ఉప తహసీల్దార్‌కు ఫార్వర్డ్ చేయాలి. ఇత ను నిర్థారించిన మీదట తహసీల్దార్ సంతకానికి పంపాలి. ఈ మొత్తం పక్రియంతా సజావుగా జరగాలి. అయితే పద్ధతి ప్రకారం జరిగితే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. అయితే ఇక్కడ ఇలా జరగడం లేదు. రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంతో తెలిసున్న వారికి గంట లోపే ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండగా.. తెలియని వారికి తంటాలు పెట్టిస్తున్నారు.
తెలిసుంటే గంటే..
ఒక వైపు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, మరోవైపు పలుకుబడి ఉన్న వాళ్లకు, రెవెన్యూ సిబ్బంది తెలిసి ఉన్న వాళ్లకు.. లేదా ఎంతో కొంత సమర్పించుకుంటున్న వాళ్లకు గంటలోపే ధ్రువీకరణ పత్రాలు అందుతున్నట్టు తెలుస్తోంది. మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొంత మంది రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మిలాఖత్ కావడంతో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని నేరుగా రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నారు. అక్కడ కొందరు సిబ్బంది తెలిసున్న వాళ్లకు గంటలోపే ధ్రువీకరణ పత్రాలు అందుతున్నాయి. అదే ఎవరూ తెలిసి లేకుంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కరుణించే వారు కరువయ్యారు. అంతేకాకుండా వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చిన వారితో సిబ్బంది ప్రవర్తన సరిగా ఉండడం లేదు. వాళ్లతో ర్యాష్ గా మాట్లాడుతుండడం ఏం చేయాలో తెలియక చాలా మంది వెనుదిరిగిపోతున్నారు. తెలిసున్న వాళ్లను సంప్రదించి, లేదా దరఖాస్తు చేసుకున్న మీ సేవ కేంద్రాల వారిని సంప్రదించి.. ఏమైనా కావాలంటే ఇస్తామని, త్వరగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతున్నారు.
అనర్హులకు బాధ్యతలు..
సిబ్బంది లేరనే సాకుతో రెవెన్యూ అధికారులు అనర్హులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏదైనా ధ్రువీకరణ పత్రం జారీ చేయాలంటే ముందుగా వీఆర్ఓ, ఆ తర్వాత ఆర్ ఐ వాటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే వీఆర్ఓలు సరిపడినంత లేరని చెప్పి వీఆర్ఏ కు ధ్రువీకరణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వీఆర్ఏల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కార్యాలయంలోనే మకాం వేసిన ఇన్ చార్జి వీఆర్ఓ (వీఆర్ఏలు) అక్కడికి వచ్చిన వారికి మాత్రమే పని చేసి పెడుతున్నారు. వారి పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. కార్యాలయానికి రాకుంటే అసలు పనే కావడం లేదు. నిబంధనల ప్రకారం ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఏడు రోజుల్లో జారీ చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం నెల రోజుల్లో జారీ చేయాలి. అయితే కొందరు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా వీఆర్ఏల ఇష్టారాజ్యం వల్ల వారి ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. ఇక్కడే అవినీతి చోటుచేసుకుంటుందనే ఆరోపణలున్నాయి. కార్యాలయంలో మకాం వేసిన కొందరు సిబ్బంది అక్కడికి వచ్చే వారితో మాట్లాడుతున్నారు. త్వరగా ధ్రువీకరణ పత్రం కావాలంటే ఇంత ఇవ్వాల్సి ఉంటుందని బేరమాడుతున్నారు. అత్యవసరంగా ధ్రువీకరణ పత్రాలు కావాలనుకునే వారు అంత ఇచ్చుకోకతప్పడం లేదు.
అధికారుల పర్యవేక్షణ కరువు..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతోందనే విమర్శలున్నాయి. ఇప్పటికే అనర్హులకు బాధ్యతలు అప్పగించగా.. వారిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన వారు కూర్చున్న చోటే పని కానిచ్చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే వారితో సైతం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. నాకు ఈ అధికారి తెలుసు.. నాకు ఆర్డీఓ తెలుసు.. అంటూ అక్కడికి వచ్చే వారితో చెప్పుకుంటున్నారు. దీంతో అసలు ధ్రువీకరణ పత్రాలు అందుతాయా లేదోనని వారు చెప్పినట్లు వినాల్సి వస్తోందని అక్కడికి వచ్చిన వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి సరైన చర్యలు తీసుకోవడంతోపాటు అనర్హులను ఆ బాధ్యతల నుంచి తప్పించకుంటే ఆ అవినీతి మకిలీ వారికి అంటుకోకతప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.